Raja Singh at Kumbh Mela : కుంభమేళాలో రాజాసింగ్.. ఖర్గేపై మండిపాటు

యూపీ ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. తన ఫ్యామిలీతో కలిసి కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుంభమేళాపై కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. మహాకుంభమేళా పై చాలా మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని రాజాసింగ్ తెలిపారు. ఒకవైపు కోట్లలో భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తుంటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లకు మాట్లాడడానికి వేరే సబ్జెక్ట్ లేక కుంభమేళాపై కామెంట్స్ చేస్తున్నారని రాజా సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేని ప్రెసిడెంట్ వచ్చిండని కూడా ప్రజలు నవ్వుతున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. హిందూ మనోభావాలు దెబ్బతీసే మాటలు మాట్లాడొద్దని, లేదంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ ఉండదని, కుంభమేళాపై ఖర్గే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com