Rajasthan Assembly : రాజస్థాన్ అసెంబ్లీలో నానమ్మ వ్యాఖ్యలు కలకలం

రాజస్థాన్ అసెంబ్లీలో 'నానమ్మ' వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా క్వశ్చన్ అవర్ లో మంత్రి గెహ్లాట్ ప్రతిపక్షాలను చూపుతూ గత బడ్జెట్ లోనూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల కు సంబంధించి ఎప్పటి లాగే మీరు కూడా మీ దాదీ (దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ) పేరు పెట్టారని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు టికా రామ్ జుల్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ "అనుచిత పదాన్ని" రికార్డు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం ప్రారంభించి వెల్ వైపు దూసు కెల్లారు. దీనిపై సభా వ్యవహారాల మంత్రి జోగారాం పటేల్ మాట్లాడుతూ.. దాదీ అనే పదం అన్ పార్లమెంటు కాదని వాదనకు దిగారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభ రెండు సార్లు వాయిదా పడింది. సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. గోవింద్ సింగ్ దోతసర, రామ్కేష్ మీనా, అమీన్ కాస్జీ, జాకీర్ హుస్సేన్, హకీమ్ అలీ సంజయ్ కుమార్ ను బడ్జెట్ సెషన్ మొత్తా నికి సస్పెండ్ చేయాలని సభా వ్యవహారాల మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి నిరస నగా కాంగ్రెస్ సభ్యలు ఆందోళనకు దిగారు. నిన్న రాత్రంతా సభలోనే ఉన్నారు. అక్కడే నిద్రించారు. ఇందిరాగాంధీపై మంత్రి చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని, కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటును ఎత్తివే యాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com