Rajasthan: వ్యాన్-కంటైనర్ ఢీ.. ఏడుగురు పిల్లలు సహా 10 మంది మృతి

Rajasthan: వ్యాన్-కంటైనర్ ఢీ.. ఏడుగురు పిల్లలు సహా 10 మంది మృతి
X
రాజ‌స్థాన్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

రాజస్థాన్‌లోని దౌసాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలు సహా 10 మంది మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున భక్తులతో వెళ్తున్న పికప్ వ్యాన్ ఆగి ఉన్న ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులు ఖతుశ్యామ్జీ ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పికప్ వ్యాన్ నిలబడి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని.. ఇప్పటివరకు 10 మంది మరణించినట్లు చెప్పారు. దాదాపు 7–8 మందిని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించినట్లు దౌసా పోలీసు సూపరింటెండెంట్ సాగర్ రాణా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ యాదవ్ మాట్లాడుతూ… ప్రాథమిక నివేదికల ప్రకారం.. బాపి సమీపంలో జరిగిన ప్రమాదంలో 10 మంది మరణించారని… తొమ్మిది మందిని చికిత్స కోసం ఆస్పత్రికి పంపించినట్లు పేర్కొన్నారు. ముగ్గురు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ప్యాసింజర్ పికప్-ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

Tags

Next Story