Ramdas Athawale : మాకు అన్నీ రాష్ట్రాలు సమానమే : రామదాస్ అథవాలే

Ramdas Athawale : మాకు అన్నీ రాష్ట్రాలు సమానమే : రామదాస్ అథవాలే
X

ఎన్డీయే ప్రభుత్వానికి అన్నీ రాష్ట్రాలు సమానమే అని కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే అన్నారు. శనివారం మెదక్లో ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఆయన పర్యటించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాజిక, ఆర్థిక న్యాయం దిశగా ఉందన్నారు. సబ్‌ కా సాత్ సబ్‌కా వికాస్ తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘దేశంలోని 85 శాతం మంది పేదల కోసం మోదీ సర్కార్ పనిచేస్తుంది. ఏపీకి రాజధాని లేకపోవడంతోనే ఎక్కువ నిధులు కేటాయించాం. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కూడా బడ్జెట్‌లో నిధులు ఇచ్చాం. సౌత్ ఇండియాలో ఎన్డీఏ మెజార్టీ స్థానాలు సాధించింది. మా ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదు.. ఐదేళ్లు అధికారంలో ఉంటాం’ అని రామదాస్ అథవాలే చెప్పారు..

Tags

Next Story