Ratan Tata : గాఢ్ ఆఫ్ భారత్.. రతన్ టాటా

మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్. దేశానికి ఆయన అందించిన సేవలు అమోఘం. ఏ పారిశ్రామికవేత్త కూడా చెయ్యని విధంగా భారత ప్రజల కోసం ఆలోచించాడు. ఈ పారిశ్రామిక వేత్త ఎంత డబ్బు వెనకేశాం అని చూడరు. ఎంత ఉత్పాదకత తెచ్చాం… ఎంత మందికి ఉపాధి కల్పించాం.. దేశానికి ఎంత మేలు చేశాం అన్నదే చూస్తారు. అదే ఆయన అసలైన సంపద. వాటర్ ప్లస్ అనే వాటర్ బాటిల్స్ నుంచి విమానయానం వరకూ ప్రతి రంగంలో మనకు సేవలందించారు. ఆయన దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కానీ ఆయన సాయంలో కొన్ని ముఖ్యమైన వాటని ఇప్పుడు చూద్దాం.
భారతదేశంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటైన టాటా ట్రస్ట్..రతన్ టాటా మార్గదర్శకత్వంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధికి ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్ట్‌లకు అనేక రకాలుగా సామమందించింది. అది మాత్రమే కాదు కరోనా సమయంలో దేశ ప్రజల కోసం రతన్ టాటా రూ. 500 కోట్లను విరాళంగా అందించారు, ప్రపంచ సంక్షోభ సమయంలో దేశానికి సహాయం చేయడంలో తన అచంచలమైన నిబద్ధతను చూపారు.
అంతకుముందు ముంబైలో ఉగ్రదాడి తర్వాత టాటా చేసిన సాయం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంటది. ముంబై దాడుల్లో తాజ్ హోటల్ ల్లో కూడా పాక్ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడి బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో అనేకమంది టాటా కంపెనీ ఉద్యోగులతో పాటు ఆ హోటల్ లో బస చేసేందుకు వచ్చిన టూరిస్టులు కూడా గాయపడ్డారు. ముంబై ఉగ్రదాడిలో చనిపోయిన మొత్తం 166మందిలో 33 మంది తాజ్ హోటల్ లోనే చనిపోయారు. ఈ 33 మందిలో 11 మంది హోటల్ ఉద్యోగులు ఉన్నారు.
అయితే ఉగ్రదాడి తర్వాత టాటా హోటల్ క్లోజ్ అవుతుందని చాలా మంది భయపడ్డారు. అయితే టాటా ఒకటే మాట ఇచ్చాడు. ఉగ్రదాడిలో గాయపడ్డ, చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటానని..తిరిగి తాజ్ హోటల్ కి పూర్వ వైభవం తీసుకొస్తానని ప్రతిజ్ణ చేశాడు. ఉగ్రదాడిలో మరణించిన తాజ్ ఉద్యోగుల ఫ్యామిలీకి.. చనిపోయిన ఉద్యోగి తన జీవితం మొత్తం ఎంత శాలరీ సంపాదిస్తాడో అంత మొత్తాన్ని బాధిత కుటుంబానికి వెంటనే అందించి వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నారు.
ఉగ్రదాడి జరిగిన రెండు వారాల్లోనే తాజ్ పబ్లిక్ సర్వీస్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు ఆదుకోవడానికి వేగవంతమైన చర్య తీసుకున్నారు. ఆ సమయంలో టాటా సన్స్ చైర్మన్ గా ఉన్న రతన్ టాటా.. ఉగ్ర దాడిలో చనిపోయిన ప్రతి ఒక్కరి ఇంటికి స్వయంగా వెళ్లి వారికి మొత్తం సాయం అందిస్తానని మాట ఇచ్చాడు. మాట ప్రకారం వారిని అన్ని రకాలుగా టాటా ఆదుకున్నారు. ఉగ్రదాడిలో మరణించిన తాజ్ ఉద్యోగుల ఫ్యామిలీకి.. చనిపోయిన ఉద్యోగి తన జీవితం మొత్తం ఎంత శాలరీ సంపాదిస్తాడో అంత మొత్తాన్ని బాధిత కుటుంబానికి వెంటనే అందించి వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నారు. ఓ రిపోర్ట్ ప్రకారం ఒక్కో బాధిత ఉద్యోగి కుటుంబానికి రూ.36 లక్షల నుంచి రూ. 85 లక్షల వరకు సాయమందించారు. ఇది కాకుండా చనిపోయిన ఉద్యోగి సర్వీస్ ప్రకారం వారి రిటైర్మెంట్ ఏజ్ వరకు నెలనెలా ఎంత సంపాదిస్తారో ఆ మొత్తాన్ని కూడా బాధిత కుటుంబాలకు అందజేసిన గొప్ప వ్యక్తి రతన్ టాటా. బాధిత కుటుంబాల పిల్లల చదువు ఖర్చుని కూడా టాటానే భరించారు. గాయపడిన తాజ్ ఉద్యోగులను కూడా హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి వారి ట్రీట్మెంట్ ఖర్చులు మొత్తం టాటానే భరించి వారి కొన్ని నెలల అదనపు జీతాన్ని కూడా అందించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com