Ratan Tata Documentary : డిస్నీ హాట్ స్టార్ లో రతన్ టాటా డాక్యుమెంటరీ
పారిశ్రామిక వేత్త రతన్ టాటా గురించి డిస్నీ+ హాట్‌స్టార్ ఓ ఎపిసోడ్ చేసింది. ‘మెగా ఐకాన్స్’ సీజన్2లో ఎపిసోడ్2లో రతన్ అతిథిగా హాజరై తన ప్రయాణానికి సంబంధించిన కొన్ని విశేషాలను పంచుకున్నారు. తక్కువ ధరలో కారు తీసుకురావాలనే ఆలోచన వెనక ఉన్న కారణాన్ని వివరించారు. ‘ఒకసారి నేను కారులో వెళ్తూ స్కూటర్‌పై వెళ్తున్న కుటుంబాన్ని చూశాను. తల్లి, తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురూ ఒకే స్కూటర్‌పై వెళ్తున్నారు. కొంతసేపటికి వాళ్లు జారి కిందపడ్డారు. ఆ సంఘటన నన్ను ఆలోచింపజేసింది. స్కూటర్‌ను సేఫ్టీగా ఎలా మార్చాలి అని ఆలోచించాను. ఆ ఆలోచనే తక్కువ ధరకు కారు తయారు చేసేలా ప్రోత్సహించింది’ అని రతన్ చెప్పారు. దీన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన పడిన కష్టాన్ని ఆ ఎపిసోడ్‌లో రతన్ వివరించారు. ప్రస్తుతం ఇది ఐదు భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో దీన్ని డిస్నీ+ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ డాక్యుమెంటరీ ఆసియా టెలివిజన్ అవార్డుకు నామినేట్ అయి.. ఉత్తమ డాక్యుమెంటరీగా సిరీస్ టైటిల్‌ను గెలుచుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com