Ravindra Jadeja : మామ ఆరోపణలు.. జడేజా భార్య ఏమందంటే?

తన మామ చేసిన ఆరోపణలపై స్పందించాలన్న ప్రశ్నకు టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భార్య రివాబా (Rivaba) ఘూటు రిప్లై ఇచ్చారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న జడేజా భార్య రివాబా ఎదుట ఓ విలేకరి ఇదే ప్రశ్న ఉంచారు. మీ మామగారు కొన్ని ఆరోపణలు చేశారు. వాటిపై మీ స్పందనేంటి అని విలేకరి ప్రశ్ని్ంచగా... ఇప్పుడు మనం నిర్వహించుకుంటున్న కార్యక్రమం ఏంటి? మీరు ఏదైనా తెలుసుకోవాలంటే నేరుగా నన్నే సంప్రదించండి. ఇక్కడ మాత్రం కాదు’’ అంటూ సమాధానం ఇచ్చారు.
కాగా కోడలి వల్లే కొడుకు దూరం అయ్యాడంటూ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సిన్హ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జడేజాకు రివాబాతో పెళ్లయిన దగ్గర్నుంచి మా కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని... ఆస్తులన్నీ ఆమె పేరిట మార్చాలని డిమాండ్ చేసిందని ఆయన ఆరోపించారు. జడేజాకు పెళ్లి చేయకపోయి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే తన తండ్రి చేసిన కామెంట్స్ పై జడేజా స్పందిస్తూ.. తన తండ్రి చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు, అర్థరహితమని అన్నారు. తన భార్య ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. తాను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ బహిరంగ వేదికల్లో అవన్నీ వెల్లడించలేనని జడేజా పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com