మే 23 నుంచి రూ. 2,000 నోట్లు మార్చుకోవచ్చు

మే 23 నుంచి రూ. 2,000 నోట్లు మార్చుకోవచ్చు
భారత్‌లో రెండు వేల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న RBI నోట్ల మార్పిడికి ఏర్పాట్లు చేసింది

భారత్‌లో రెండు వేల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న RBI నోట్ల మార్పిడికి ఏర్పాట్లు చేసింది. ఈనెల 23 నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకులకు సమర్పించి ఇతర నోట్లను పొందొచ్చని తెలిపింది. అయితే దీని కోసం RBI నిర్దేశించిన రిక్వెస్ట్‌ ప్రొఫార్మాను పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ ఫామ్‌లో డిపాజిట్‌ దారుడు తన వివరాలు రాయడంతో పాటు సంతకం చేయాల్సి ఉంటుంది.

అలాగే ఒరిజినల్‌ గుర్తింపు పత్రాన్ని బ్యాంకు సిబ్బందికి చూపాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్‌ తో పాటు పాపులేషన్‌ రిజస్టర్‌లను గుర్తింపు పత్రంగా పరిగణిస్తారు. వీటిలో ఏదో ఒకటి ఒరిజినల్‌ కాపీ బ్యాంకు సిబ్బందికి చూపాల్సి ఉంటుంది. అయితే సదరు వ్యక్తికి బ్యాంకు అకౌంట్‌ లేకున్నా నోట్ల మార్పిడికి అనుమతించనున్నారు.

Tags

Next Story