DK Shivakumar : ఆదాయానికి మించి ఆస్తుల కేసు.. డీకే శివకుమార్ కు రిలీఫ్
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఊరట దక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో విచారణను కొనసాగించే విషయంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ కోర్టులో రెండు పిటిషన్లలు దాఖలయ్యాయి. ఒకదాన్ని సీబీఐ దాఖలు చేయగా.. మరొకటి బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ దాఖలు చేశారు. వీటిని తాజాగా పరిశీలించిన న్యాయస్థానం విచారణను కొసాగించేందుకు వీలు లేదంటూ రెండు పిటిషన్లను కొట్టివేసింది. దీంతో డీకేకు ఊరట దక్కింది. సీబీఐ దర్యాప్తునకు సంబంధించి మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప సర్కార్ గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది. న్యాయస్థానం తీర్పుపై స్పందించిన డీకే.. ‘కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా’ అని పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com