బాబ్రీ మసీదు నిర్మాణమా.. ఎందుకీ మత రాజకీయాలు..?

బాబ్రీ మసీదు నిర్మాణమా.. ఎందుకీ మత రాజకీయాలు..?
X

దేశంలో మళ్లీ సున్నితమైన మతపర రాజకీయాలకు తెరతీస్తున్నారు కొందరు. దేశవ్యాప్తంగా హిందువుల ఆగ్రహాలను రెచ్చగొట్టే విధంగా పశ్చిమ బెంగాల్ లో సంచలన ఘటన మొదలైంది. పశ్చిమ బెంగాల్‌లో ముర్షీదాబాద్‌లో సస్పెన్షన్‌కు గురైన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హుమాయున్‌ కబీర్‌ గట్టి బందోబస్తు మధ్య బాబ్రీ మసీదు తరహాలో తలపెట్టిన మసీదుకు శంకుస్థాపన చేశారు. 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు ధ్వంసమైన నాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సౌదీ అరేబియా నుంచి ఇద్దరు మతపెద్దలతో పాటు వేలాదిమంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు కబీర్‌ తెలిపారు. అక్కడికి వచ్చిన వారంతా తలపై ఒక ఇటుక పెట్టుకుని బాబ్రీ మసీదు కోసం తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. మరి కొన్ని రోజుల్లో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు రాబోతున్నాయి.

ఇలాంటి సమయంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం అస్సలు మంచిది కాదు. సెక్యులర్ అనే ముసుగులో హిందువుల మనోభావాలను రెచ్చగొట్టడం ఏంటి. అసలు సెక్యులర్ అనే పదం ఇండియాది కానే కాదు. ఇండియా మొదటి నుంచి హిందూదేశమే. ఈ సెక్యులర్ అనే పదాన్ని అంబేద్కర్ కూడా రాజ్యాంగం లో మొదట్లో రాయలేదు. మధ్యలో దాన్ని చేర్చారు. హిందువుల మీద దాడులు జరిగినప్పుడు మాత్రమే ఈ సెక్యులర్ అనే పదం మనం వింటాం.

మిగతా మతాలపై దాడులు చేసినప్పుడు ఇలాంటి పదాలు అస్సలు వినిపించవు. వేల మంది హిందువుల ప్రాణ త్యాగాలతో బాబ్రీ మసీదును కూల్చేసి అక్కడ రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. అది దేశానికి ఒక హిస్టారికల్ మూమెంట్. అలాంటి బాబ్రీ మసీదును మళ్లీ కట్టడం వెనక రాజకీయ కుట్ర కోణాలతో పాటు మతపరమైన గొడవలు సృష్టించడం దీని అసలు కారణంగా కనిపిస్తోంది. గత జగన్ పాలనలో కూడా బలవంతంగా మతమార్పిడులు జరిగాయని వైసీపీ నేతలే ఎన్నోసార్లు చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వంలో అన్ని మతాలను సమానంగా చూస్తూ హిందువులకు పెద్దపీట వేస్తున్నారు. అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఉండాలి గానీ మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ధి చేసుకోవడం మంచిది కాదు.


Tags

Next Story