Retreat Ceremony : దేశ సరిహద్దులో రీట్రీట్ పునః ప్రారంభం

భారత్-పాక్ సరిహద్దుల్లో జాయింట్ చెక్ పోస్టుల వద్ద రీ ట్రీట్ మంగళవారం నుంచి పునః ప్రారం భమైంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రీట్రీట్ కార్యక్రమాన్ని భారత్ నిలిపివేసింది. ప్రస్తుతం ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభించినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. అయితే రీట్రీట్ సెర్మనీపై పలు ఆంక్షలు విధించారు. తొలిరోజు మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని, బుధవారం నుంచి నుంచి సాధారణ పౌరులకూ ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు. రీట్రీట్ సమయంలో సరిహద్దు గేట్లు మూసేవుంటాయని, పాక్ సిబ్బందితో కరచాలనం కూడా ఉండదని చెప్పారు. బీఎస్ఎఫ్ దళాలు ప్రతిరోజూ జెండాను అవనతం చేస్తున్నాయని వెల్లడించారు. అట్టారీ-వాఘా, హుస్సేనివాలా, ఫజిల్కా వద్ద రిట్రీట్ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com