CM Revanth : ఢిల్లీలో బిజీగా రేవంత్ రెడ్డి.. కేంద్రానికి విన్నపాలు ఇవే

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిసి సీఎం.. ఇవాళ మరికొందరితో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు విజ్ఞప్తులు చేస్తున్నారు. అటు ఏఐసీసీ పెద్దలతో సీఎం సమావేశం తర్వాత.. మంత్రివర్గ విస్తరణపై కీలక ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రదాన్‌తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. రీజినల్ రింగ్ రోడ్డుకు అవసరమైన టెక్నికల్, ఎకనామికల్ క్లియరెన్స్‌లు వెంటనే ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ ఎంపీలతో కలిసి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్. హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్-విజయవాడ ఆరులైన్ల విస్తరణ డీపీఆర్ ఆమోదించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పలు నేషనల్ హైవేలకు నిధులు కేటాయించాలని.. కొన్ని రోడ్ల అలైన్‌మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. పలు ప్రాజెక్టు వద్ద రోప్ వేలు ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో భేటీలో సీఎం రేవంత్ కీలక విషయాలను ప్రస్తావించారు.. రీజినల్ రింగ్ రోడ్ మొత్తానికి కేంద్ర కేబినెట్ ఆమోదం, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ – 2, మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్ర సహాయం, మూసీ – గోదావరి నదుల అనుసంధానం, హైదరాబాద్ సీవరేజీ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి చేయూత, సింగరేణికి గనుల కేటాయింపు చేయాలని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com