పోస్టల్ సేవల్లో విప్లవాత్మక మార్పులు.. రిజిస్టర్ పోస్టు రద్దు.. ఓటీపీ డెలివరీ.. కొత్త టారిఫ్‌లు అమలు

పోస్టల్ శాఖ తన సేవల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. బ్రిటిష్ కాలం నుంచి అమలులో ఉన్న రిజిస్టర్ పోస్టు విధానాన్ని రద్దు చేసి దాన్ని స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబరు 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. రిజిస్టర్ పోస్టు ఇకపై ప్రత్యేక సర్వీస్‌గా కాకుండా స్పీడ్ పోస్టు కింద వాల్యూ యాడెడ్ సర్వీసుగా అందుబాటులో ఉంటుంది. పాత రిజిస్టర్ పోస్టు మాదిరిగానే ఈ సేవలో కూడా ఎవరి పేరుతో పంపామో వారికే పోస్టుమ్యాన్ ఉత్తరాన్ని ఇచ్చి సంతకం తీసుకుంటారు.
నిర్దేశిత టారిఫ్‌కు అదనంగా ఈ సేవ కోసం జీఎస్టీ కాకుండా ఒక్కో ఆర్టికల్‌కు రూ. 5 చెల్లించాల్సి ఉంటుంది. తపాలా శాఖ దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్‌ను కూడా రూపొందించింది.
ఓటీపీ ఆధారిత డెలివరీ కొత్త సర్వీసు స్పీడ్ పోస్టుకు సంబంధించి మరో ముఖ్యమైన సేవ.. ఓటీపీ ఆధారిత డెలివరీ అందుబాటులోకి రానుంది.
ఈ సర్వీసు కింద, ఉత్తరం డెలివరీ సమయంలో చిరునామాదారు ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీని ధ్రువీకరించుకున్నాకే పోస్టుమ్యాన్ ఉత్తరాన్ని అందజేస్తారు.
ఈ భద్రతా సేవ కోసం కూడా నిర్దేశిత టారిఫ్‌తో పాటు జీఎస్టీ కాకుండా అదనంగా రూ. 5 వసూలు చేస్తారు.
వినియోగదారులకు తగ్గింపులు తపాలా శాఖ కొన్ని వర్గాల వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది:
1. విద్యార్థులకు: స్పీడ్ పోస్టు ధరను పది శాతం తగ్గించింది.
2. బల్క్ సర్వీసులు: కొత్తగా బల్క్ సేవల్ని వినియోగించుకునే సంస్థలకు 5 శాతం ప్రత్యేక తగ్గింపును ప్రవేశ పెట్టింది.
ఈ మార్పుల ద్వారా తపాలా సేవల్లో వేగం, భద్రత మరింత పెరుగుతాయని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని తపాలా శాఖ ఆశిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com