Road Accident : లారీని ఢీకొట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్‌..

Road Accident : లారీని ఢీకొట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్‌..
X
ఐదుగురు మృతి.. 15 మందికి గాయాలు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓ వోల్వో బస్సు ఒకటి.. ట్రక్కును స్పీడ్ గా ఢీ కొనింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే ఐదురుగు చనిపోగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఢిల్లీ నుంచి అజాంఘడ్‌ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన డబుల్‌ డెక్కర్‌ బస్సు.. తప్పల్‌ దగ్గర ఎదురుగా వస్తున్న ఖాళీ బీర్ల సీసాల ట్రక్కును ఢీ కొట్టేసింది.

ఇక, ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. ఇందులో ఓ పసికందు, ఓ మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నట్లు తెలుస్తుంది. మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం మొత్తం తుక్కుతుక్కు అయిపోయింది. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని అతి కష్టం మీద బయటకు తీయగా.. గాయపడిన వారిని జెవార్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రతాప్‌గఢ్‌కు చెందిన కృష్ణా ట్రావెల్స్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు ఢిల్లీ నుంచి అజాంగఢ్ వైపు వెళ్తున్న సమయంలోనే.. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పాయింట్ నంబర్ 56కి చేరుకోగానే వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో బస్సు భారీగా ధ్వంసమైంది. మృతుల్లో ఓ చిన్నారితో పాటు మహిళ ఉన్నారన్నారు. బస్సు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొట్టడంతో బస్‌ ముందుభాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదం అనంతరం బస్‌లోని క్షతగాత్రుల రోధనలు మిన్నంటాయి. ప్రమాదాన్ని గమనించిన పలువురు బస్‌ అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.


Tags

Next Story