DelhiL రష్యన్ యూట్యూబర్ లైవ్‌ వీడియోలోనే ...

DelhiL  రష్యన్ యూట్యూబర్ లైవ్‌ వీడియోలోనే ...
విసిగించి అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి

రష్యాకు చెందిన కోకో అనే యువతి భారత్ మీద ప్రేమతో 'కోకో ఇన్ ఇండియా' పేరిట ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తోంది.దేశంలోని పలు దర్శనీయ స్థలాలకు వెళుతూ, తన అనుభవాలను వీడియోల రూపంలో పంచుకుంటుంది. ఆమె యూట్యూబ్ చానల్ కు 2.05 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అయితే, ఇటీవల ఆమె ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా ఓ ఆకతాయి ఆమె వెంటపడ్డాడు. నువ్వు బాగున్నావు, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? అంటూ ఓ కుర్రాడు సరోజినీ నగర్ మార్కెట్ వద్ద ఆమెను సతాయించాడు. అప్పటికీ, కోకో ఎంతో సంయమనంతో మాట్లాడి, అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఆ యువకుడు ఆమెని ఫాలో అవుతూ అసభ్యంగా మాట్లాడుతూనే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

సోషల్ మీడియాలో చాలా మంది తమ వీడియోలతో ఫేమస్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అంటూ తర్వాత రకరకాల ఆఫర్లు కూడా కొట్టేసిన వారు ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు దేశాలు దాటి విదేశాల్లో కూడా వీడియోలు చేసి తమ ఫాలోవర్లను పెంచుకునేవారు ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఒక వ్యక్తి ఆ రష్యన్ మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉంది. తాను స్నేహితుడిగా ఉండేందుకు మీరు అంగీకరిస్తున్నారా అంటూ ఆ వ్యక్తి రష్యన్ యూట్యూబర్‌‌ను అడగడం అందులో కనిపిస్తోంది.


ఫ్రెండ్ షిప్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆ రష్యన్ మహిళ.. అతని నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆమెను ఫాలో అవుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే మరింత రెచ్చిపోయిన ఆ వ్యక్తి.. నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అంటూ ఆమె పట్ల అసభ్యకరమైన రీతిలో మాటలు కలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వీడియో కోకో యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. విదేశీయుల పట్ల ఇలా ప్రవర్తించి దేశం పరువు తీస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అతడి వైఖరి పట్ల భారతీయులుగా తాము క్షమాపణలు చెబుతున్నామంటూ రష్యన్ యువతి కోకోకు సంఘీభావం తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story