Delhi : 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా

Delhi  : 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా
X

27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. కేంద్రంలో మూడు పర్యాయాలుగా బీజేపీ అధికారం చేపడుతున్నా హస్తిన పీఠం దక్కకపోవడం ఆ పార్టీకి వెలితిగా ఉండేది. కానీ ఇవాళ ఆ కోరిక తీరింది. అద్భుతమైన రాజకీయ వ్యూహాలతో ఆప్ కంచుకోటను బద్దలుకొట్టిన కమలదళం దేశ రాజధానిలో పాగా వేసింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాను సైతం ఓడించి కోలుకోలేని దెబ్బకొట్టింది.

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయానికి కేంద్ర నిర్మలా సీతారామనే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నగరంలో ఎక్కువగా ఉద్యోగులే ఉంటారు. వారి చిరకాల కోరికైన ఇన్ కం టాక్స్ తగ్గింపును నిర్మలమ్మే తీర్చారని పేర్కొంటున్నారు. 50:50 ఉన్న విజయ సమీకరణాన్ని ఆమె బీజేపీ వైపు మార్చేశారని విశ్లేషిస్తున్నారు. బ్యాలెట్ ఓట్లలో 50% కన్నా ఎక్కువ వారికే పడటం దీనిని ప్రతిబింబిస్తోందని అంటున్నారు.

Tags

Next Story