Modi : ఆపరేషన్‌ సిందూర్‌ జవాన్లకు సెల్యూట్‌: మోదీ

Modi : ఆపరేషన్‌ సిందూర్‌ జవాన్లకు సెల్యూట్‌: మోదీ
X

దేశ వీర జవాన్లు శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టారని, పహల్గామ్‌లో మతం అడిగి మరీ పర్యాటకులను ఉగ్రవాదులు చంపారని ప్రధాని మోదీ అన్నారు. ఎర్రకోట వద్ద ఆయన మాట్లాడుతూ భార్య, కన్నబిడ్డల కళ్లెదుటే దారుణంగా కాల్చి చంపారని, పహల్గామ్‌ దాడితో యావత్‌ దేశం ఆక్రోశంతో రగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆక్రోశానికి సమాధానంగానే ఆపరేషన్‌ సిందూర్‌ అని, భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, యుద్ధతంత్రాలు, వ్యూహాలు పూర్తిగా మన జవాన్లే తయారుచేసుకున్నారని మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌తో మన సత్తా చాటామని, ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు నిద్ర పట్టకుండా చేశామని, ఉగ్రమూకలకు మన సైన్యం బుద్ధి చెప్పిందని ప్రధాని మోదీ కొనియాడారు. ఇకపై బ్లాక్‌మెయిల్‌ చేసేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Tags

Next Story