Samsung : శాంసంగ్ కు కేంద్రం షాక్.. రూ.5,168 కోట్ల టాక్స్ నోటీసులు

Samsung : శాంసంగ్ కు కేంద్రం షాక్.. రూ.5,168 కోట్ల టాక్స్ నోటీసులు
X

టారిఫ్ ఉల్లంఘనలకు పాల్పడడంతో పాటు, పన్ను ఎగ్గొట్టిందనే ఆరోపణలతో రూ.5,168 కోట్లు చెల్లించాలని కేంద్రం టాక్స్ నోటీసులు పంపింది. భారత చట్టాలను శాంసంగ్ కావాలనే ఉల్లంఘించిందనీ.. కస్టమ్ అధికారుల ముందు తప్పుడు పత్రాలు సమర్పించిందని కస్టమ్స్ కమిషనర్ సోనాల్ బజాజ్ తమ నోటీసులో తెలిపారు. లాభాలను పెంచుకోవా లనే ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని మోసం చేసి, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న టెలికం పరికరాలకు పన్ను ఎగ్గొట్టినట్లు అందులో తెలిపింది. ట్యాక్స్, పెనాల్టీలు కలిపి రూ.5,168 కోట్లు చెల్లించాలని ట్యాక్స్ డిమాండ్ లో తెలిపింది. శాంసంగ్ తన నెట్వర్క్ డివిజన్ ద్వారా టెలికం పరికరాలను భారత్కు దిగుమ తి చేసుకుంటోంది. 10-20 శాతం పన్ను భారాన్ని తప్పించుకునేందుకు వీటిని తప్పుగా వర్గీకరించినట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఈ టెలికం పరికరాలను మొబైల్ టవర్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తర్వాత వీటిని ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు శాంసంగ్ విక్రయిస్తోంది. ఈ విషయంపై 2023లోనే శాంసంగ్ను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. 2021 నుంచే విచారణ జరుపుతోంది. అయితే, శాంసంగ్ మాత్రం ఈ టెలికం కంపోనెట్లకు టారిఫ్ లు వర్తించవని వాదిస్తోంది. పన్ను అధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని కోరుతోంది. ట్యాక్స్ డిమాండ్ ను ట్యాక్స్ ట్రైబ్యునల్ లేదా కోర్టులో సవాల్ చేసే అవకాశముంది. గత ఏడాది శాంసంగ్ ఇండియా నికర లాభం 955 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇప్పుడు అందులో సగానికి పైగా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags

Next Story