"సంచార్ సాథీ"పై రచ్చ..

సంచార్ సాథీపై రచ్చ..
X

కేంద్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టడానికి తీసుకొచ్చిన సంచార్ సాథీ యాప్ పై నానా రచ్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతోపాటు లోకల్ పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను కేంద్ర ప్రభుత్వం తెలుసుకునే ఛాన్స్ ఉందని.. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం అంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విమర్శించారు. ఉభయ సభల్లో కూడా దీనిపై పెద్ద రచ్చ జరిగింది. ఫోన్ కొన్నప్పుడు అందులో ప్రీ ఇన్ స్టాల్ అయి రావటం ఏంటని, అన్ ఇన్ స్టాల్ చేసుకునే ఛాన్స్ లేదని.. ఇది సేఫ్ కాదని అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది మాత్రం వేరే. తాము సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టేందుకు, పోగొట్టుకున్న మొబైల్ ఫోను రికవరీ చేసేందుకు దీన్ని తీసుకొచ్చామని చెబుతోంది.

ఇందులో ఎలాంటి మిస్ యూస్ లేదని.. యూజర్ల డాటా అస్సలు లీక్ కాదని అంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 లక్షల సైబర్ క్రైమ్ నేరాలు జరిగాయని.. 23 వేల కోట్ల ప్రజల సొమ్ము సైబర్ నేరస్తుల చేతిలోకి వెళ్లిందని.. దాన్ని తాము రికవరీ చేస్తున్నామని తెలిపారు. ఈ యాప్ వద్దు అనుకుంటే అన్ అన్ఇన్ స్టాల్ చేసుకునే అవకాశం ఉందని కేంద్రం చెబుతోంది. టిడిపి నేత కేంద్ర టెలి కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఇదే చెబుతున్నారు. ఒక ఫేస్ బుక్, గూగుల్ మ్యాప్స్ లాంటివి ఎలాగైతే ప్రీ ఇన్ స్టాల్ చేసి వస్తాయో.. ఆ తర్వాత వాటిని డిలీట్ చేసుకునే ఛాన్స్ ఎలాగైతే ఉంటుందో ఈ సంచార్ సాథీ యాప్ కూడా అలాగే ఉంటుందని తెలిపారు. ప్రజలకు వస్తున్న ఫ్రాడ్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్ ల నెంబర్ లను ఆ యాప్ లో ఒక పదిమంది రిపోర్టు చేస్తే ప్రభుత్వం వాటిని బ్లాక్ చేస్తుందని చెబుతున్నారు.

అలా తమకు ఎక్కువ మంది ఈ ఫ్రాడ్ నెంబర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే సైబర్ నేరాలను చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ యాప్ ప్రీ ఇన్ స్టాల్ అయి వచ్చినా సరే అందులో యూజర్ ఐడి క్రియేట్ చేసుకుంటేనే దాన్ని వాడొచ్చని చెబుతున్నారు. ఫోన్ లో ముందే ఉన్నంత మాత్రాన అది యూజర్ డేటాను తెలుసుకోలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. ఈ యాప్ ద్వారా ఇప్పటికే వందల కోట్లు రికవరీ చేశామన్నారు. దీని ద్వారా ఎవరి డేటా లీక్ కాదని హామీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కోటి మందికి పైగా దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు.


Tags

Next Story