Sharath Pawar: రెండు రోజుల పాటు బెంగళూరులో విపక్షాల మీటింగ్

విపక్షాల తదుపరి సమావేశంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. సమావేశం వేదికను సిమ్లా నుంచి బెంగళూరుకు మార్చారు. వచ్చే నెల 13, 14 తేదీలలో రెండు రోజుల పాటు విపక్షాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 23న పట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ నివాసంలో సమావేశమైన 15 విపక్ష పార్టీలకు చెందిన 32 మంది ముఖ్యనాయకులు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. తదుపరి కార్యాచరణ, అజెండా ఖరారుకు వచ్చే నెల 10న సిమ్లాలో సమావేశం కావాలని తొలుత నిర్ణయించారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో సమావేశం వేదికను బెంగళూరుకు మార్చారు.
బీజేపీపై సమిష్టిగా పోరాడాలని పట్నా సమావేశంలో విపక్ష పార్టీలనాయకులు అందరు కలిసి ప్రాథమికంగా నిర్ణయించారు.ఆయా రాష్ట్రాల్లో కలిసి కట్టుగా పనిచేస్తూనే ముందుకు వెళ్లేలా బెంగళూరు సమావేశంలో అజెండాను సిద్ధం చేయనున్నారు.బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు రోడ్ మ్యాప్‌ను ఫైనలైజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరో వైపు విపక్ష కూటమి బలోపేతం దిశగా నాయకులు చర్యలు చేపట్టారు. బీజేపీకి దూరంగా ఉన్న 10కి పైగా చిన్న పార్టీలను విపక్ష కూటమి వైపు రప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com