Scientist Rajagopala Chidambaram : శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత

భారత భౌతిక శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. 1975, 1998 అణు పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అణుశక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారునిగా పనిచేశారు. 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. చెన్నైలో జన్మించిన రాజగోపాల చిదంబరం.. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌తో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్‌డీ సాధించారు. 1975లో జరిపిన పోఖ్రాన్ 1, 1998 నిర్వహించిన పోఖ్రాన్ 2 అణుపరీక్షల్లో కీలకంగా పనిచేశారు. బాబా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) డైరెక్టర్‌గా వ్యవహరించిన రాజగోపాల చిదంబరం అణుశక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గానూ సేవలందించారు. అణుశక్తి విభాగం కార్యదర్శిగా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 199లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com