Monkeypox: ప్రజలను భయపెడుతున్న కొత్త వైరస్ మంకీపాక్స్.. ఈ వ్యాధిని గుర్తించేందుకు..

Monkeypox: ప్రపంచ దేశాలను మరో వైరస్ వణికిస్తోంది. ఓపక్క కరోనా మహమ్మారి గుబులు పుట్టిస్తుంటే.. మరోపక్క మంకీపాక్స్ వైరస్ కలకలంరేపుతోంది. ఇప్పటికే 21 దేశాలకు విస్తరించింది. మొత్తం 200లకుపైగా కేసులు బయట పడ్డాయి. మరో వందకు పైగా అనుమానిత కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు హెల్త్ చెకప్ చేస్తున్నారు.మంకీపాక్స్ పేరు వినగా ప్రజలంతా జంకిపోతున్నారు.
భారత్‌లోనూ ఈవైరస్ కలవరం పెడుతోంది. కొత్త వైరస్ కోరలు చాస్తుండటంతో పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. ఈక్రమంలో మనదేశంలో పరిశోధనలను మొదలు పెట్టారు. మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్ హెల్త్‌కేర్.. పరిశోధనలు చేసింది. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఓ రియల్ టైమ్ పీసీఆర్ కిట్‌ను తయారు చేసింది. ట్రివిట్రాన్ హెల్త్ కేర్‌కు చెందిన రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం ఆర్‌టీ-పీసీఆర్ కిట్‌ను రూపొందించింది.
నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారిత కిట్‌గా ఉంటుందని బృందం సభ్యులు తెలిపారు. వన్ ట్యూబ్ సింగిల్ రియాక్షన్ ఫార్మాట్‌లో స్మాల్ పాక్స్, మంకీపాక్స్ ఉన్న తేడాను ఇట్టే గుర్తించగలదు. ఆర్‌టీ-పీసీఆర్ కిట్ ద్వారా గంటలోనే ఫలితం వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈకిట్‌తో టెస్ట్ చేసుకునేందుకు పొడి స్వాబ్‌లతోపాటు వీటీఎం స్వాబ్‌లను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com