Anil Ambani : అనిల్ అంబానీకి షాక్ ఇచ్చిన సెబీ

నిధుల మళ్లింపు కేసులో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్(RHFL) మాజీ ఉద్యోగులు, 24 సంస్థలపై సెబీ నిషేధం విధించింది. ఐదేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనవద్దని ఆదేశించింది. అనిల్ అంబానీపై రూ.25 కోట్ల ఫైన్ వేసింది. లిస్టెడ్ కంపెనీల్లో ఎలాంటి కీలక హోదాల్లో కొనసాగకూడదని స్పష్టం చేసింది. ఉద్యోగుల సాయంతో RHFL నిధులను అనిల్ అనుబంధ సంస్థలకు రుణాలుగా మళ్లించినట్టు సెబీ తెలిపింది. లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్, కీ మేనేజర్ పర్సనల్ లాంటి పదవులు దక్కకుండా ఆదేశాలు ఇచ్చింది. సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి కంపెనీ నిధుల మళ్లింపు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెక్యూరిటీల మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై ఆరు నెలల పాటు నిషేధంతో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై రూ. 6 లక్షల జరిమానా విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com