ఢిల్లీ దాడుల వెనక సంచలన నిజాలు.. వాళ్లంతా పెద్ద ప్లానే చేశారా..?

ఢిల్లీ దాడుల వెనక సంచలన నిజాలు.. వాళ్లంతా పెద్ద ప్లానే చేశారా..?
X

దేశ రాజధాని దద్దరిల్లిపోయింది. ఎర్ర కోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పేలుడు సంభవించడం.. అక్కడికక్కడే దాదాపు 9 మంది చనిపోవడం, ఆస్పత్రిలో మరో నలుగురు మొత్తంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పదులకొద్దీ గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది డాక్టర్ ఉమర్. అతను ఐ20 కారులో ఆత్మాహుతి దాడి చేసుకుని ఇంత మందిని చంపేశాడు. ఈ దాడి జరిగిన వెంటనే ఎన్ ఐఏ, ఎన్ ఎస్జీ బృందాలు వచ్చాయి. ఎంక్వయిరీ చేస్తున్నాయి. అసలు ఎవరీ ఉమర్ అంటే.. గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి నలుగురు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా హర్యానాలోని ఫరీదాబాద్ లో వందల మంది పోలీసులు కూంబింగ్ నిర్వహించి ఉగ్రవాది సానుభూతి పరులను అరెస్ట్ చేశారు.

అదీల్ అహ్మద్, ముజిమ్మల్ షకీల్, సాహిన్, సయ్యద్ అహ్మద్ మొహియుద్ధీన్ అనే నలుగురు డాక్టర్లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మరో డాక్టర్ అయిన అమర్ కూడా వీరి టీమ్ లోనే ఉన్నాడు. కానీ అతన్ని అరెస్ట్ చేసేలోపే ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ నలుగురు డాక్టర్లను అరెస్ట్ చేస్తున్న టైమ్ లో ఫరీదాబాద్ లో 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎంత పెద్ద ఉగ్ర కుట్ర అనేది ఊహించంది. ఎందుకంటే పుల్వామా దాడిలో ఉగ్రవాదులు వాడింది 350 కిలోల అమ్మోనియం నైట్రేట్. ఇప్పుడు 2900 కిలోలు అంటే ఏ స్థాయి బీభత్సానికి వాళ్లు ప్లాన్ చేశారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.

మరి ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంటే మన ఇంటెలిజెన్స్ సంస్థ ఏం చేస్తోంది. ఈ నలుగురు డాక్టర్లను అరెస్ట్ చేసినప్పుడే ఉమర్ తప్పించుకున్నాడని పోలీసులకు ముందే తెలుసా అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఉమర్ తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అనే భయంతోనే ఈ పేలుడు ఘటనకు పాల్పడ్డట్టు సమాచారం అందుతోంది. ఈ కారును పుల్వామాకు చెందిన తారిక్ కొన్నాడు. ఇప్పటికే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కారు ఉగ్రవాదుల చేతుల్లోకి ఎలా వెళ్లిందనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. డాక్టర్లు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల రూపంలో వీళ్లు ఎలాంటి దాడులకు ప్లాన్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈ ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ ను మరింత దూకుడుగా నిర్వహిస్తారా అనే ప్రచారం కూడా జరుగుతోంది.


Tags

Next Story