Shivaji Statue: శివాజీ విగ్రహం ధ్వంసం కేసులో కాంట్రాక్టర్ అరెస్ట్

Shivaji Statue: శివాజీ విగ్రహం ధ్వంసం కేసులో  కాంట్రాక్టర్ అరెస్ట్
X
ఇప్పటికే విగ్రహ శిల్పిపై హత్యాయత్నం కేసు నమోదు

గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్‌ 4న సింధుదుర్గ్‌లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తయిన శివాజీ విగ్రహం ఈ నెల 26న కుప్పకూలింది. ఈ కేసులో నిర్మాణ సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే విగ్రహం శిల్పిపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా, విగ్రహం కూలిపోవడంపై రాజకీయ దుమారం చెలరేగుతున్నది. ఘటనపై విపక్ష మహావికాస్‌ అఘాడీ తప్పుపడుతూ సీఎం ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నది. సెప్టెంబర్‌ 1న నిరసన ర్యాలీ చేపడతామని ప్రకటించింది.

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిన ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. కాంట్రాక్టర్ చేతన్ పాటిల్ ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. చేతన్‌ను మహారాష్ట్రలోని కొల్హాపుల్‌లో అరెస్టు చేశారు. స్థానిక క్రైమ్ బ్రాంచ్ బృందం చేతన్‌ను అరెస్టు చేశారు. ఈరోజు ఆయనను సింధుదుర్గం తీసుకురానున్నారు. 35 అడుగుల ఎత్తైన శివాజీ మహారాజ్ విగ్రహం ఆగస్ట్ 26న అకస్మాత్తుగా పడిపోయింది. 8 నెలల క్రితం డిసెంబర్ 4న శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ విగ్రహం కేవలం 8 నెలల్లోనే పడిపోయింది. శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన తర్వాత మహారాష్ట్రలో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సీఎం ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలని ఉద్ధవ్ వర్గం డిమాండ్ చేసింది.

సింధూదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ధ్వంసం గురించి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితాల మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎవరు పడగొట్టారు, అతను ఏ పార్టీకి చెందినవాడు? ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అవమానించినందుకు క్షమాపణలు చెప్పడం వల్ల ఏమీ కాదు, చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పడిపోవడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఘటన దురదృష్టకరమని సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఈ ఘటనకు సంబంధించి 100 సార్లు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. త్వరలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తయారు చేస్తానని షిండే తెలిపారు. శివాజీ మహారాజ్ విగ్రహాన్ని భారత నౌకాదళం డిజైన్ చేసి నిర్మించిందని సీఎం షిండే చెప్పారు. ఆ తర్వాత విగ్రహం కూలిపోవడానికి గల కారణాలపై విచారణ జరిపి కొత్త విగ్రహాన్ని నిర్మించేందుకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇంజనీర్లు, ఐఐటీ నిపుణులు, నేవీ అధికారులు ఉన్నారు. ఈ సంఘటనపై, భారత నావికాదళం గురువారం మాట్లాడుతూ.. విగ్రహానికి మరమ్మతులు చేసి వీలైనంత త్వరగా పునఃస్థాపన చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

Tags

Next Story