సముద్రంలో దొరికిన భారీ శివలింగం.. చూసేందుకు తరలి వస్తున్న జనం

సముద్రంలో దొరికిన భారీ శివలింగం.. చూసేందుకు తరలి వస్తున్న జనం
గుజరాత్‌లోని భరూచ్‌ సమీపంలోని సముద్రంలో శివలింగం గుర్తించారు మత్స్యకారులు. ఈ శివలింగం దాదాపు 100 కిలోల బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.

గుజరాత్‌లోని (Gujarat) భరూచ్‌ సమీపంలోని సముద్రంలో శివలింగం గుర్తించారు మత్స్యకారులు. ఈ శివలింగం దాదాపు 100 కిలోల బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో, శివలింగం వారి వలలో చిక్కుకుంది. ఏదో భారీ చేప వలలో చిక్కిందని మత్స్యకారులు భావించారు. వలన పైకి లాగిన తరువాత వారికి అర్థమైంది అది శివలింగ ఆకారంలో ఉన్న ఒక రాయి అని. దాన్ని అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం ఊళ్లో వాళ్లకు తెలియడంతో సముద్రంలో దొరికిన శివలింగాన్ని చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు భరూచ్‌కు తరలివచ్చారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసు బలగాలను మోహరించారు.

గుజరాత్‌లోని జంబూసర్ తహసీల్‌లోని కవి గ్రామానికి చెందిన పది మంది మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ విషయం గురించి సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇటీవలిసముద్రంలో సంభవించిన ఆటుపోటుల కారణంగా ఈ శివలింగం నీటి ఉపరితలంపైకి వచ్చి ఉండవచ్చని ఇప్పటివరకు జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో మత్స్యకారుల వలలో సులభంగా చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతే కాకుండా శివలింగంపై నాగుపాము గుర్తులు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. స్థానిక మత సంస్థలు ఇప్పుడు కవి గ్రామ సమీపంలో శివలింగాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దాని గురించి చర్చిస్తున్నారు. ఈ శివలింగం ఏ రాతితో నిర్మితమైందనే విషయంపై నిపుణులు ఆరా తీస్తున్నారు. దీన్ని తయారు చేసిన రాయి సమీపంలోని ఏ రాష్ట్రంలో ఉంది అనే విషయాన్ని గురించి కూడా పరిశీలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story