JayaPrada : జయప్రదకు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

మాజీ ఎంపీ, వెటరన్ సినీ నటి జయప్రదకు (JayaPrada) మరో షాకింగ్ న్యూస్ ఇది. ఈఎస్ఐకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమెకు జైలు శిక్ష పడిన విషయం తెల్సిందే. లేటెస్ట్ గా మరో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ యూపీ రామ్ పూర్ జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున రాంపూర్ నుంచి లోక్ సభ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు. ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతోంది. కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, అరెస్టు చేయలేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు పోలీసులపై సీరియస్ అయింది. వెంటనే ఆమెను అరెస్టు చేసి కోర్టులో తీసుకురావాలంటూ రామ్ పూర్ ఎస్పీని ఆదేశించింది. విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com