Preity Zinta : పోస్ట్ చూసి షాకయ్యా.. కాంగ్రెస్ పార్టీపై ప్రీతి జింటా ఫైర్

Preity Zinta : పోస్ట్ చూసి షాకయ్యా.. కాంగ్రెస్ పార్టీపై ప్రీతి జింటా ఫైర్
X

బాలీవుడ్ నటి ప్రీతి జింటా కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. తాను సోషల్ మీడియా అకౌంట్లు సొంతంగానే నిర్వహించుకుంటానని, ఎవరికీ ఇవ్వలేదని, ఇలా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడింది. పదేండ్ల కిందటే బ్యాంకు నుంచి తాను తీసుకొన్న రుణాన్ని తీర్చేశానని స్పష్టంచేసింది. ప్రీతి జింటా తన సోషల్ మీడియా అకౌంట్లను బీజేపీకి అప్పగించినందుకు.. ముంబై న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్లో ఆమె తీసుకున్నరూ. 18 కోట్ల రుణం మాఫీ అయ్యిం దని ఆరోపిస్తూ కేరళ హస్తం పార్టీ ట్విట్టర్లో పోస్టు పెట్టింది. దీనిపై ప్రీతిజింటా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. ‘కాంగ్రెస్ చేసిన పోస్ట్ చూసి నేను షాక్ అయ్యా. నాకోసం ఎవరూ.. ఏ రుణాన్నీ మాఫీ చేయలే. ఒక రాజకీయ పార్టీ నా పేరును వాడి ఫేక్ న్యూస్ ఎలా ప్రచారం చేస్తుంది? పదేండ్ల కిందట ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకొని.. దానిని కట్టేసిన. విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచా రాలు చేయడం సిగ్గుచేటు. భవిష్యత్తులో ఎటువంటి అపార్థాలు రాకూడదనే ఉద్దే శంతో ఆ పార్టీ కామెంట్లపై స్పందిస్తున్న’ అని ప్రీతిజింటా పేర్కొంది.

Tags

Next Story