జగన్నాథ రథ యాత్రలో విషాదం

జగన్నాథ రథ యాత్రలో విషాదం
జగన్నాథ రథ యాత్రలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటన అందరినీ కలచివేస్తోంది.

త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జగన్నాథ రథ యాత్రలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటన అందరినీ కలచివేస్తోంది.రథ యాత్ర జరుగుతున్న టైమ్‌లో ఒక్కసారిగా హైటెన్షన్‌ వైర్లు తెగి రథంపై పడ్డాయి.దీంతో ఒక్కసారిగా రథానికి విద్యుత్‌ షాక్‌ తగిలింది.రథంపై ఉన్న భక్తులు ఏడుగురు స్పాట్‌లో చనిపోయారు.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు వున్నారు.మరో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి.హుటాహుటిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఉనాకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్‌ ప్రాంతంలో ఇస్కాన్‌ ఆధ్వర్యంలో జగన్నాథ రథ యాత్ర ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.అయితే, ఈ సారి అది విషాదాంతం కావడం అందరినీ కలచివేస్తోంది.రథం ఇనుముతో తయారు చేసినది కావడంతో విద్యుత్‌ వైర్లు తగలగానే రథం మొత్తం కరెంటు పాసైంది.. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది.రథాన్ని లాగుతున్న వందలాది మంది భక్తులు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు.తలో దిక్కు పరుగులు పెట్టారు.షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన తర్వాత భారీగా మంటలు ఎగసిపడ్డాయి. చివరకు కరెంటు సరఫరా నిలిపివేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఇక ప్రమాదంలో గాయపడిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు దుర్ఘటన గురించి తెలియగానే త్రిపుర ముఖ్యమంత్రి మానిక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఏడుగురు మృతిచెందిన విషయం తనను కలచివేస్తోందని చెప్పారు.మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి మానిక్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story