INDIA Alliance : ఇండియా కూటమిలో ఉండాలా వద్దా: ఆప్ సందిగ్ధం

ఢిల్లీ ఓటమితో ఆమ్‌ఆద్మీ పార్టీలో నిస్తేజం నెలకొంది. ఒకవైపు పంజాబ్‌లో పార్టీ చీలిపోతుందేమోనని భయం. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, అవధ్ ఓజా, సత్యేందర్ జైన్ అడుగుపెట్టలేని పరిస్థితి. పార్టీని ఆతిశీ టేకోవర్ చేస్తారేమోనన్న ఆందోళన. వీటన్నిటి నడుమ ఇండియా కూటమిలో కొనసాగాలో లేదో తేల్చుకోలేని పరిస్థితిలో ఆప్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిని వీడొచ్చని వారి అంచనా.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎమ్మెల్యేలతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు ఢిల్లీలో సమావేశం అవుతారని తెలిసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 30కి పైగా ఎమ్మెల్యే లు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు బాహాటంగానే చెప్తున్నారు. పైగా శాంతిభద్రతలు, టెర్రరిజం, డ్రగ్ మాఫియా అంతంపై అమిత్ షా డైరెక్షన్లో మాన్ పనిచేస్తున్నారు. దీంతో కేజ్రీకి చీలిక భయం పట్టుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com