Siddaramaiah : ప్రైవేటు కోటా బిల్లుపై వెనక్కి తగ్గిన సిద్ధరామయ్య సర్కార్

Siddaramaiah : ప్రైవేటు కోటా బిల్లుపై వెనక్కి తగ్గిన సిద్ధరామయ్య సర్కార్
X

ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకే ప్రాధాన్యం ఇచ్చేందుకు తీసుకువచ్చిన బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Siddaramaiah ) వెల్లడించారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. ఈ బిల్లుపై కొంత గందరగోళం ఏర్పడింది.

వచ్చే సమావేశంలో చర్చించి సందేహాలను నివృత్తి చేస్తాం.. దీనిపై సభలోనూ వివరంగా చర్చిద్దాం... అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రైవేటు బిల్లుపై ముఖ్యమంత్రి వైఖరి స్పష్టంగా లేదని, దీనిపై స్పష్టత ఇవ్వాలని విపక్ష నేత ఆర్ అశోకా డిమాండ్ చేశారు. మరో వైపు గురువారం ఈ అంశంపై అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బిల్లుపై ప్రభుత్వం భిన్న వ్యాఖ్యలు చేయడం, చివరకు దాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం తుగ్లక్ పాలనలా ఉందని విపక్ష నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు.

Tags

Next Story