Jammu : జమ్ములో మోగుతూనే ఉన్న సైరన్లు.. ఇళ్లలోనే జనం

X
By - Manikanta |9 May 2025 5:15 PM IST
జమ్మూలోనూ ఉదయం సైరన్లు మోగాయి. తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో నగరాన్ని బ్లాక్ అవుట్ చేశారు. సరిహద్దు జిల్లాల్లో పాక్ నుంచి వస్తోన్న డ్రోన్లను భారత బలగాలు సమర్థంగా కూల్చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. బీఎస్‌ఎఫ్ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌ను పంపగా.. భద్రతా బలగాలు కూల్చేశాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com