Bengal Government : ముర్షీదాబాద్లో పరిస్థితి అదుపులోనే ఉంది : బెంగాల్ ప్రభుత్వం

ముర్షీదాబాద్ హింసాకాండపై బెంగాల్ ప్రభుత్వం కోల్కతా హైకోర్టుకు గురువారం నివేదిక సమర్పించింది. ముర్షిదాబాద్ జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని పేర్కొంది. మత ఘర్షణలు చెలరేగిన ముర్షిదాబాద్ జిల్లాలో బాంబు పేలుళ్లు జరిగాయని, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కి అప్పగించాలంటూ బిజెపి నేత సువేందు అధికారి కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై జస్టిస్ సౌమన్ సేన్, జస్టిస్ రాజా బసు చౌదరిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఆ జిల్లాలో అధికార యంత్రాంగం, పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారని ఆ నివేదిక పేర్కొంది. బాధిత కుటుంబాలు ఇప్పటికే వారి నివాసాలకు చేరుకున్నారని తెలిపింది. ముర్షిదాబాద్లోని క్షేత్రస్థాయి పరిస్థితుల సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని, అక్కడ సిఎపిఎఫ్ మోహరింపును మరికొంత కాలం పొడిగించాలని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది కోర్టును కోరారు. ముర్షిదాబాద్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రస్తుతం 17 కంపెనీల బలగాలను కేంద్రం మోహరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com