Jharkhand : జార్ఖండ్ లో కనిపించిన మహాభారతంలోని పాము

Jharkhand : జార్ఖండ్ లో కనిపించిన మహాభారతంలోని పాము
X

అత్యంత విషపూరితమైన పాము జార్ఖండ్ రాష్ట్రంలో కనిపించింది. దానిని తక్షక పాముగా పరిశీలకులు చెబుతున్నారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీ పట్టణంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఇది కనిపించింది. ఇది ఎక్కడి నుంచో ఆఫీసులోకి చొరబడిందో తెలియదు. కానీ ఆ పామును చూసిన సిబ్బంది భయంతో వణికిపోయారు. మామూలు పాములకు భిన్నంగా ఉన్న ఆ సర్పాన్ని చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ జాతి పాములు అంతరించిపోతున్న పాముల జాబితా ఉన్నాయి. ఈ తక్షక నాగు ఎక్కువగా చెట్లపైనే నివసిస్తూ ఉంటుంది. ఒక చెట్టు మీది నుంచి మరో చెట్టు మీదరకు గాల్లోనే 100 అడుగుల మేర జంప్ చేయగలిగే సామర్థ్యం దీని సొంతం. ఈ పాముకు మహాభారతానికి సంబంధం వుందనీ.. నాడు భారతదేశాన్ని పారిపాలించిన పరీక్షిత్తు అనే మహారాజును తక్షకుడనే పాము కాటేసినట్లు పండితులు చెబుతున్నారు. ఇదే పేరుతో కొన్ని వందల ఏళ్లుగా పూజలు జరుగుతున్నాయని అంటున్నారు.

Tags

Next Story