Petrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించిన పలు రాష్ట్రాలు..

Petrol And Diesel Price: చమురు ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. ఫలితంగా దేశ ప్రజలకు కాస్త ఊరట లభించినట్లైంది.పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు 8 రూపాయలు, డీజిల్‌పై లీటరుకు 6 రూపాయలు తగ్గించింది కేంద్రం. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా.. 9 రూపాయల 50పైసలు, 7 రూపాయల వరకు దిగివచ్చింది. అయితే.. ప్రజలకు మరింత ఉపశమనం కలిగించాలంటే రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించాలని పిలుపునిచ్చింది కేంద్రం..
కేంద్రం పిలుపుతో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు చమురుపై సుంకాన్ని తగ్గిస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు 2 రూపాయల 8 పైసలు, డీజిల్‌పై రూపాయి 44 పైసలు వ్యాట్‌ను తగ్గించింది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా 2 వేల 500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. ఈ నిర్ణయంతో మహారాష్ట్రలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయి.
ముంబయిలో చమురుపై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తగ్గింపు తర్వాత లీటర్ పెట్రోల్ 111 రూపాయల 35 పైసలు ఉండగా, లీటర్ డీజిల్ ధర 97 రూపాయల 28 పైసలుగా ఉంది. అటు రాజస్థాన్ సైతం.. కేంద్రం బాటలోనే నడిచింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటన చేశారు. పెట్రోల్‌పై లీటర్‌కు 2 రూపాయల 48 పైసలు, డీజిల్‌పై రూపాయి 16 పైసలు చొప్పున వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
కేరళ ప్రభుత్వం సైతం పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌పై లీటర్‌కు 2 రూపాయల 41 పైసలు, డీజిల్‌పై రూపాయి 36 పైసల చొప్పున వ్యాట్‌ను తగ్గించింది. మరోవైపు ఎలాంటి నిర్ణయం తీసుకోని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ సేకరణలో లోటును చూపుతూ, అలా చేయడంలో ముందుకు సాగలేమని ప్రకటించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com