Shabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు 26 స్పెషల్ ట్రైన్స్

Shabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు 26 స్పెషల్ ట్రైన్స్
X

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తు లకోసం సౌత్ సెంట్రల్ రైల్వే 26 స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయం, కొచ్చికి ఈ రైళ్లు రాకపోకలు సా గించనున్నాయి. ఈనెల 16 నుండి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటాయి. కాచిగూడ కొట్టాయం కాచిగూడ మధ్య రైలు నెం. 07131/07132 నవంబర్ 17, 24 తేదీల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరుతుంది. కాచిగూడ కొట్టాయం కాచిగూడ మధ్య రైలు నెం. 07133/ 07134 నవంబర్ 18, 25 తేదీల్లో రాత్రి 8.50కి కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. హైదరాబాద్ కొట్టాయం హైదరాబాద్ మధ్య రైలు నెం. 07135/07136 నవంబర్ 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు హై దరాబాద్ లో బయల్దేరుతుంది. సికింద్రా బాద్ కొట్టాయం సికింద్రాబాద్ మధ్య రైలు నెం. 07137/ 07138 నవంబర్ 22, 29 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుం ది. నాందేడ్ కొల్లాం సికింద్రాబాద్ మధ్య రైలు నెం. 07139/ 07140 నవంబర్ 16న నాందేడ్ నుంచి బయల్దేరుతుంది. మౌలాలి కొల్లాం మౌలాలి మధ్య రైలు నెం. 07141/07142 నవంబర్ 23, 30 తేదీల్లో మౌలాలి నుంచి బయల్దేరుతుంది.

Tags

Next Story