Tamil Nadu : మళ్లీ స్టాలినే తమిళనాడు సీఎం!.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి

Tamil Nadu : మళ్లీ స్టాలినే తమిళనాడు సీఎం!.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి
X

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరుపై మెజారిటీ ప్రజలు సానుకూలంగా ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లోనూ మళ్లీ ఆయన్నే సీఎంగా గెలిపించుకుంటామని చెబుతున్నారు. తాజాగా జరిగిన సీఓటర్ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుం టారనే ప్రశ్నకు రాష్ట్ర ప్రజల్లో అత్యధికులు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వైపే మొగ్గుచూపారు. స్టాలిన్ తర్వాత సీఎం రేసులో టీవీకే అధ్యక్షుడు విజయ్న ప్రజలు కోరుకుంటున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిసామి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఎన్నికలు, ప్రజల జీవనస్థితికి సంబంధించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్ కు 27 శాతం మంది మద్దతుగా నిలుస్తు న్నారు. విజయకు 18శాతం, పళనిసామికి 10శాతం, బీజేపీ నేత అన్నామలైకు 9శాతం మంది మద్దతిచ్చారు. ఇక డీఎంకే ప్రభుత్వం పట్ల 50శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. వీరిలో 15 శాతం మంది అత్యంత సంతృప్తికరంగా ఉందని తెలిపారు. 36శాతం మంది సంతృప్తికరంగా ఉందని చెప్పగా, 25శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తంచేశారు. 24 శాతం మంది సమాధానం చెప్పలేమని వెల్లడించారు. సీఎంగా స్టాలిన్ పరిపాలన, పనితీరును అత్యంత అద్భుతంగా ఉందని 22 శాతం మంది పేర్కొనగా, 33శాతం మంది సంతృప్తి వ్యక్తంచేశారు. మరో 22 శాతం మంది అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సర్వే నివేదిక తేల్చిచెప్పింది.

Tags

Next Story