Mumbai : బాంద్రా రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట .. 9 మందికి గాయాలు

Mumbai : బాంద్రా రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట .. 9 మందికి గాయాలు
X

బాంద్రా టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పైకి భారీగా ప్రయాణికులు ఒక్కసారిగా రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీపావళి పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో రైల్వేస్టేషన్‌ కిక్కిరిపోయింది. బాంద్రా నుంచి గోరఖ్‌పుర్‌కు వెళ్లే రైలు ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పైకి రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని షబ్బీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్రం కంగాయ్ (27), దివ్యాంశు యోగేంద్ర యాదవ్ (27), మహ్మద్ షరీఫ్ షేక్ (25), ఇంద్రజిత్ సాహ్ని (19), నూర్ మహ్మద్ షేక్ (18)గా పోలీసులు గుర్తించారు.

Tags

Next Story