Maharashtra: వీడియో కోసం కారుతో విన్యాసం.. 300 అడుగుల లోయలో పడిపోయిన యువకుడు..

Maharashtra: వీడియో కోసం కారుతో విన్యాసం.. 300 అడుగుల లోయలో పడిపోయిన యువకుడు..
X
మహారాష్ట్రలోని పఠాన్ కొండపై కారుతో యువకుడు చేసిన స్టంట్లు సోషల్ మీడియాలో వైరల్..

సోషల్‌ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు చేస్తున్న చిత్ర విచిత్రమైన విన్యాసాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుంది. బహిరంగ ప్రదేశాల్లో చేసే విన్యాసాలతో ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని ఓ టూరిజం ప్రదేశంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పఠాన్‌- సదావాఘాపుర్‌ మార్గంలోని ఓ కొండ పైన బుధవారం నాడు కరాడ్‌లోని గోలేశ్వర్‌కు చెందిన సాహిల్‌ జాదవ్‌, తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ ప్లేస్ కి వచ్చాడు. రీల్స్ కోసం కొండ చివరన కారుతో స్టంట్లు చేయడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అదుపు తప్పడంతో 300 అడుగుల లోయలో జారీ పడింది. ఈ ఘటనలో సాహిల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో సహాయక బృందాలు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటి విన్యాసాలు చేయొద్దని పోలీసులు టూరిస్టులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.

అయితే, గుజర్వాడి ప్రాంతంలోని పఠాన్‌ నుంచి 3-4 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ టూరిజం ప్లేస్ లో నిత్యం పర్యాటకులతో సందడిగా కనిపిస్తుంది. పెద్ద లోయగా ఉండే ఈ ప్రాంతంలో భద్రతాపరమైన మౌలిక సదుపాయాలు మాత్రం కనపడవు. దీంతో ఇక్కడ గతంలోనూ పలు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ వెంటనే భద్రతా రెయిలింగ్‌లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Tags

Next Story