Delhi : ఢిల్లీలో సూపర్ సిక్స్.. ఆరుగురు మంత్రుల బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోండి

ఢిల్లీలో ఫిబ్రవరి 20న సీఎం, ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. వాళ్లు ఎవరు.. వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది చాలామంది ఇంటర్నెట్ లో సర్చ్ చేశారు. ఆ సమాచారం మీకోసం.
పర్వేశ్ వర్మ: న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. ఆప్ అధినేత కేజీవాల్ ను ఓడించారు. ఢిల్లీలో జాట్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె స్వాతిసింగ్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.
కపిల్ మిశ్రా: ఆప్ మాజీ నాయకుడు. కరావాల్ నగర్ నియోజకవర్గం నుండి గెలిచారు. తూర్పు ఢిల్లీ మాజీ మేయర్ అన్నపూర్ణ మిశ్రా, సోషలిస్ట్ నాయకుడు రామేశ్వర్ మిశ్రా దంపతుల కుమారుడు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో జలవనరుల మంత్రిగా పనిచేశారు. 2019లో బీజేపీలో చేరారు.
మంజీందర్ సింగ్ సిర్సా: ఇతను బీజేపీలో సిక్కు నాయకుడు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజౌరి గార్డెన్ నుంచి గెలిచారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సిర్సా గతంలో శిరోమణి అకాలీదళ్ లో రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. ఆ తర్వాత బీజేపీ గూటికి చేరారు.
ఆశిష్ సూద్: ఢిల్లీలోని పంజాబీ కమ్యూనిటీలో ఆశిష్ సుపరిచితుడు. జనక్ పురి నుండి తొలిసారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పరి పాలనా విషయాలలో అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. బీజేపీ ఢిల్లీ విభాగానికి ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. గోవాకు బీజేపీ ఇన్చార్జ్ గా, జమ్మూ కాశ్మీర్ విభాగానికి సహ-ఇన్చార్జిగా ఉన్నారు.
పంకజ్ కుమార్ సింగ్: కాస్పురి నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పూర్వాంచల్ నాయకుడైన వృత్తిరీత్యా దంతవైద్యుడు.
రవీందర్ ఇంద్రజ్ సింగ్: బీజేపీలోని దళిత నాయకుడు. బవానా (ఎస్సీ) స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 31,000 పైచిలుకు మెజారిటీతో గెలిచాడు. బీజేపీ షెడ్యూల్డ్ కుల మోర్చాలో కార్యనిర్వాహక సభ్యుడుగానూ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com