Supreme Court : ఉచితాలపై కేంద్రానికి, ఈసీకి సుప్రీం నోటీసులు

Supreme Court : ఉచితాలపై కేంద్రానికి, ఈసీకి సుప్రీం నోటీసులు
X

ఎలక్షన్ల ముంగిట రాజకీయ పార్టీలి చ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణిస్తూ ఆదేశాలివ్వాలన్న పిల్ పై ముందడుగు పడింది. కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే అంశంపై నమోదైన పలు పెండింగ్ కేసులనూ ఈ పిటిషన్కు ట్యాగ్ చేసింది. కర్నాటకకు చెందిన శశాంక్ జె శ్రీధర అనే వ్యక్తి దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత హమీలు చేయకుండా చర్యలు తీసుకోవాలని, దీనిపై ఎన్నికల ప్యానెల్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. న్యాయవాదులు విశ్వాదిత్య శర్మ, బాలాజీ శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్ లో పార్టీలు ఉచితాలపై నియం త్రణ లేకుండా వాగ్దానాలు చేస్తున్నాయని, దీని ప్రభావం ప్రభుత్వ ఖజానాపై పడుతోందని పే ర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై మోయలేని భారాన్ని మోపుతాయని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అధికారం లోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిసీ డీవై చంద్రచూడ్, న్యా యమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రా లతో కూడిన ధర్మాసనం యూనియన్ ఆఫ్ ఇండియా, పోల్ ప్యానెల్కు నోటీసులు జారీ చేసింది.

Tags

Next Story