Maharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్ వాయిదా..

Maharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్ వాయిదా..
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసినా.. అక్కడ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది.

Maharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసినా.. అక్కడ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా శివసేన పార్టీ మరోసారి ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనర్హత వేటుపై తుదినిర్ణయం తీసుకునే వరకు కొత్త సీఎం షిండేతోపాటు.. మరో 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది.

ఈ మేరకు శివసేన చీఫ్‌ విప్ సునీల్ ప్రభు సుప్రీకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. అయితే దీనితో పాటు పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లను ఈ నెల 11వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే రేపు స్పీకర్ నామినేషన్ ప్రక్రియ చేపట్టనుంది. ఎల్లుండి స్పీకర్ ఎన్నిక చేపట్టి.. ఈనెల 4వ తేదీన బలపరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story