Isha Foundation : సద్గురు ఈషా ఫౌండేషన్ కి ఊరట

Isha Foundation : సద్గురు ఈషా ఫౌండేషన్ కి ఊరట
X

చెన్నై: సద్గురుకు చెందిన ఈషా యోగా సెంటర్ కి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈషా ఫౌండేషన్ పై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కాగా ఈషా ఫౌండేషన్ తన ఇద్దరు కుమార్తెలు నిర్బం ధించి, సన్యాసం తీసుకునేలా చేశారంటూ ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఈషా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీంతో ఈ పిటిషన్ అక్కడికి బదిలీ అయింది. కేసు విచారణలో భాగంగా పిటిషనర్ కుమార్తెలు తాము స్వచ్ఛందంగానే అక్కడ ఉంటున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో పిటిషన్ ను కొట్టివే సింది. కాగా కేసు విచారణలో భాగంగా ఈషా ఫౌండేషన్ కు సంబంధించి అలందురై పోలీస్ స్టేషన్ లో గత 15 ఏళ్లలో 6 మిస్సింగ్, 7 సూసైడ్కేసులు నమోదయ్యాయని తమిళనాడు పోలీసులు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పిం చారు. నమోదైన ఆరు మిస్సింగ్ కేసుల్లో ఐదు కేసులను వెనక్కి తీసుకున్నట్టు పోలీసులు వెల్ల డించారు. ఆరో కేసుకు సంబంధించి విచారణ సాగుతోందని తప్పిపోయిన వ్యక్తిని ఇంకా గు ర్తించలేదని తెలిపారు. ఏడు ఆత్మహత్య కేసులు నమోదుకాగా.. వాటిలో రెండు కేసుల్లో ఫోరెన్సి క్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు.

Tags

Next Story