Supreme Court : రిజర్వేషన్లపై నితీష్ కుమార్‌కు సుప్రీంలో ఎదురు దెబ్బ

బిహార్ ముఖ్యమంత్రి నీతీశకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బిహార్ 65 శాతం రిజర్వేషన్ చట్టం నిలుపుదలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇప్పటికే పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వం దాఖలు చేసిన దాదాపు 10 పిటిషన్లను విచారించేందుకు అంగీకరించింది. వాటిని సెప్టెంబరులో విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్టీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంపును గతంలో పట్నా హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బిహార్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. తాజాగా ఈ ఉత్తర్వులపై విచారణ జరిపిన సుప్రీం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. నీతీశ్ సర్కారు గతేడాది నవంబరులో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతున్నట్టు అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టింది. దాంతో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 65 శాతానికి పెరిగాయి. ఈ పెంపుపై కొన్నివర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.
ఈ క్రమంలోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం జూన్ 20న 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీని అమలును నిలిపివేస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ సుప్రీంకోర్టును కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com