Supreme Court Rules : ఉద్యోగాల భర్తీల మధ్యలో రూల్స్ మార్చొ

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత భర్తీ ప్రక్రియ మధ్య నిబంధనలు మార్చడానికి వీళ్లేదని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ పీఎన్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. నియామక ప్రక్రియ ప్రారంభించే ముందే ప్రభుత్వాలు నిబంధనలను ప్రభుత్వాలు ముందే నిబంధనలు సిద్ధం చేసుకోవాలి తర్వాతే అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసుకోవాలని.. తర్వాత వాటిని మార్చ డానికి వీళ్లేదని పేర్కొంది. కాగా ట్రాన్స్ లేటర్ పోస్టుల ఉద్యోగ నియామకాల్లో నిబంధనలు మార్చారంటూ 2013లో రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాతపరీక్ష, వైవాలో మొత్తం 75 శాతం మార్కులు సాధించినవారే ఉద్యోగా లకు అర్హులని నిబంధనలు విధించింది. దీంతో పలు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులపై ఈ నిబంధనలు ప్రభావం చూపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com