Supreme Court : దత్తత, పిల్లల కొనుగోలుపై సుప్రీంకోర్టు సీరియస్

Supreme Court : దత్తత, పిల్లల కొనుగోలుపై సుప్రీంకోర్టు సీరియస్
X

దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా పిల్లల కొనుగోలు వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు రోజుల ప సిగుడ్డును కొనుగోలు ద్వారా ఎలా దత్తత తీసుకుంటారని, ఇదెక్కడి మానవత్వం అని ప్రశ్నించింది. తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన తల్లిదండ్రులు రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే... ఈ సింగిల్ బెంచ్ పేరెంట్స్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ... స్టేట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లింది. ఈ అప్పీల్ పై వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ డివిజన్ బెంచ్ తీర్పు ను సవాల్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్ర భుత్వం తమ వాదన విన్నాకే ఉత్తర్వులు ఇవ్వాలని కేవియట్ వేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

తొలుత పిటిషనర్ల తరపు అడ్వొకేట్ వాదనలు వినిపిస్తూ... తమకు పిల్లలు లేకపోవడంతో ఈ పిల్లల్ని దత్తత తీసుకున్నట్లు బెంచ్ కు తెలిపారు. ఈ దత్తత తీసుకొన్న పిల్లలతో రెండేండ్లుగా తమకు ఎమోషనల్ అటాచ్మెంట్ పెరిగిందని తెలిపారు. అయితే ఎప్పుడైతే పోలీసులు ఆ పిల్లల్ని తీసుకుపోయారో అప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారని నివేదించారు. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం కోర్టు విస్తృత అధికారులను ఉపయోగించి తాము తీసుకున్న పిల్లల్ని తమకు ఇప్పించాలని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు విశేషాధికారులతో ఇల్లిగలిటీని, లీగల్ అని చెప్పలేమని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులపై సింపతి చూపించగలం తప్ప... మీరు చేసింది న్యాయపరంగా కరెక్ట్ అని చెప్పలేమని పేర్కొంది. బయోలాజికల్ ప్రేరెంట్స్ నుంచి చిన్నారులను దత్తత తీసుకున్న వాళ్లు కాదు పర్చేజ్ చేసిన వాళ్లు అని కామెంట్ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదిన చేపడతామని విచారణ వాయిదా వేస్తూ స్పష్టం చేసింది.

Tags

Next Story