Supreme Court: రాష్ట్రపతి బిల్లులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగానే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి కాగా అంతా ఆశ్చర్యపోతున్నారు.
2021లో తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన మాజీ ఐపీఎస్ అధికారికి ఆర్.ఎన్. రవి కుమార్‌కు.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తరచుగా వివాదాలు సాగుతున్నాయి. ముఖయంగా గవర్నర్ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని.. బిల్లులు, నియామకాలను అడ్డుకుంటున్నారని స్టాలిన్ సర్కారు ఆరోపిస్తుంది. ముఖ్యంగా తాము పంపిన 10 బిల్లులను చాలా కాలంగా ఆయన దగ్గరే ఉంచుకుంటున్నారని కోర్టును ఆశ్రయించింది. చాలా రోజులుగా దీనిపై విచారణ సాగుతుండగా.. ఇటీవలే సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది.
ముఖ్యంగా తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి కుమార్ అలాగే ఉంచడం రాజ్యాంగ విరుద్ధం అని ఇటీవలే సుప్రీం కోర్టు తెలిపింది. ఏదైనా బిల్లును మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఆపాల్సి వస్తే.. అందుకు గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు కేవలం ఒక్క నెల మాత్రమేనని వివరించింది. శాసన సభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని ఆపాలనుకుంటే మూడు నెల్లలోగా అలంటి బిల్లును శాసన సభకు తిరిగి పంపించాలని సూచించింది.
గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించకపోతే ఆయన చర్యలపై కోర్టులు న్యాయ సమీక్ష కూడా జరపొచ్చని.. సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మంత్రి మండలి సలహా మేరకు పని చేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణా అధికారులు లేవని వివరించింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం.. కొన్ని సవరణలతో బిల్లును తిరిగి శాసన సభకు పంపొచ్చని.. అయితే శాసనసభ దాన్ని తిరిగి పంపింతే గవర్నర్ కచ్చితంగా దానికి ఆమోదం తెలపాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేల బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా ఉందని భావిస్తే దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపొచ్చని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com