Supreme Court : ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం..సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లు (Electoral bonds) . రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం తేల్చి చెప్పింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌కు చట్టబద్ధత ఉంటుందా లేదా అన్న పిటీషన్లపై కోర్టు తీర్పును వెలువరించింది. బ్లాక్ మనీ సమస్యను పరిష్కరించేందుకు పోల్ బాండ్స్ స్కీమ్ ఒక్కటే పరిష్కారం కాదు అని కోర్టు పేర్కొన్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలు ఆ ధర్మాసనంలో ఉన్నారు.
ఈ స్కీంను రద్దు చేయాలని.. రాజ్యాంగ విరుద్ధం అని కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ జయ ఠాకూర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), NGO అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. నవంబర్ 2వ తేదీన తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సుదీర్ఘంగా సాగిన విచారణలో.. ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఎలక్ట్రోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు.
ఎలక్ట్రోరల్ బాండ్లు.. వీటినే ఈ బాండ్లు అని కూడా అంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది.. . ఈ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలను అందించటం అనే పథకాన్ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేసింది. దేశంలోని రాజకీయ పార్టీలకు చాలా మంది నిధులు ఇస్తుంటారు.. అలాంటి నిధులకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు.. అంతేకాదు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు చందాలు వస్తుంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com