Supreme Court : సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్

Supreme Court : సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్
X

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. అందులో క్రిప్టో కరెన్సీని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను పోస్ట్‌ చేయడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ యూట్యూబ్‌ ఛానల్‌లో అమెరికాలోని రిపిల్‌ ల్యాబ్స్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్‌ఆర్పీని ప్రచారం చేస్తూ వీడియోలు కన్పించాయి. శుక్రవారం ఉదయం నుంచి ఈ సమస్య తలెత్తింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఐటీ విభాగం చర్యలు చేపట్టింది. జాతీయ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ను సంప్రదించడంతో ప్రస్తుతానికి ఈ ఛానల్‌ లింక్‌ను తొలగించారు. ఈ యూట్యూబ్‌ ఛానల్‌ లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసులతో పాటు కొన్ని కీలక కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు.

Tags

Next Story