నటులుగా మారనున్న మాజీ నక్సలైట్లు

నటులుగా మారనున్న మాజీ నక్సలైట్లు
నక్సలైట్లపై సినిమా కాదు నక్సలైటలతో సినిమా

లొంగిపోయిన నక్సలైట్ అన్న పదం మనకి బాగానే పరిచయం. వాళ్లని చాలా గౌరవంగా జనజీవన శ్రవంతిలో కలుపుకుంటామని చెప్తాం కానీ వారు ఆ తరువాత చేసే ఉద్యోగాలు మనకి పెద్దగా తెలియదు. అలాంటి వారికి సినిమా రంగంలో అవకాశాలు ఇవ్వడానికి ఒక టీమ్ ముందుకు వచ్చింది. పోలీసుల సహకారంతో లొంగిపోయిన నక్సలైట్లకు ఆడిషన్ కూడా నిర్వహించింది

సినిమాలో హీరో హీరోయిన్లు ఎంత ముఖ్యమో మిగతా ఆర్టిస్టులు కూడా అంతే ముఖ్యం. మనం ప్రాధాన్యత ఇచ్చిన ఇవ్వకపోయినా సినిమాల నటించే ప్రతి ఒక్క వ్యక్తి శ్రద్ధ పెట్టి చేయాల్సిందే. అందుకే సినిమా నటన తయారు చేసేందుకు ఎన్నో ఇన్స్టిట్యూట్ లు కూడా ఉంటాయి. కానీ కొంతమంది సహజ నటులు ఉంటారు. వాళ్లకి పెద్దగా తర్ఫీదు అవసరం లేదు అలాంటి వాళ్ల కోసం ఆడిషన్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇక అలాంటి ఆడిషనే మహారాష్ట్రలో జరిగింది అయితే ఇందులో ఆడిషన్ కి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా లొంగిపోయిన నక్సలైట్లు.

గచ్చిరోలీ జిల్లా ఎక్కువగా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం. ఇక్కడ పోలీసులు లొంగిపోయిన నక్సలైట్లకు జీవన ఉపాధి కలిగిస్తున్నారు. తాజాగా వారిని సినీ రంగంలోకి వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటి తృప్తి, నిర్మాత విశాల్ కపూర్ గడ్చిరోలి జిల్లాలోని గిరిజన సంప్రదాయాల ఆధారంగా ఓ సినిమా నిర్మిస్తున్నారు. దీనికోసం లొంగిపోయిన నక్సలైట్లను ఆ సినిమాలో నటించేలా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఆడిషన్ శనివారం నిర్వహించారు. ఈ ఆడిషన్ కు పురుషులు మహిళలు హాజరయ్యారు. వారిలో కొంతమందిని ఎన్నుకొని వారికి వాయిస్ మాడ్యుయేషన్, నటనలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. వీరంతా భవిష్యత్తులో కూడా సినిమాల్లో నటించే అవకాశం వచ్చేలా వీటికి శిక్షణ ఇస్తామని ఈ సందర్భంగా మూవీ టీమ్ చెప్పారు. తృప్తి నటిగానే కాదు పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story